skip to main |
skip to sidebar
కల్వరి మిషన్ ఆధ్వర్యంలో కల్వరి మహోత్సవములు మన భీమవరంలో మార్చ్ 1,2,3 తేదీలలో జరగనున్నాయి. స్థానిక లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఈ సభలు జరగనున్నాయి. కల్వరి మిషన్ వ్యవస్థాపకులు అయిన Dr. P. సతీష్ కుమార్ గారు 3 రోజులపాటు వాక్య పరిచర్య చేస్తారు. అతి చిన్న వయసులో దేవునికి సమర్పించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఆత్మలను దేవుని వద్దకు నడిపిస్తున్న దైవ జనులుగా పేరున్న సతీష్ కుమార్ భీమవరంలో సభలు నిర్వహించాలని స్థానికంగా అనేకమంది ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా ఇన్నాళ్ళకు వారి కోరిక ఫలించి భీమవరంలో సభలు జరుగుతున్నాయి. భీమవరం మరియు భీమవరం పరిసర ప్రాంతాలనుండి సుమారు 50,000 ఫై చిలుకు ప్రజలు ఈ సభలకు హాజరు కానున్నారని ఒక అంచనా. అయితే అంత మందికి సరిపడా స్థలం లేకపోవటంతో అనేకమంది దూరంనుంచి వినటం ద్వార మాత్రమే సరిపెట్టుకోవలసిన పరిస్థితి. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మికంగా మరింత బలపడాలని www.apchristiannews.com తరపున దేవుని ప్రార్దిస్తున్నాము.