Friday, March 11, 2011

యాత్రికుని ప్రయాణము (The Pilgrim's Progress)


యాత్రికుని ప్రయాణము అనే ఈ పుస్తకము ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యము పొంది అనేకమంది ఆత్మీయజీవితానికి ఒక చుక్కానిలా నిలిచింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంగ్లాండ్ కు చెందినా జాన్బన్యన్ ఈ పుస్తకాన్ని క్రీ. శ. 1672 వ సంవత్సరంలో జైలు నందు గడుపుచూ వ్రాసెను. క్రైస్తవ ఆత్మీయజీవితములో ఎదుర్కొను సవాళ్లు, సాతాను కలిగించు అవరోధాలు, అడ్డంకులు, వాటిని ఎదుర్కోనవలసినఉపాయాలు చిట్టా చివరికి చేరుకోవలసిన గమ్యము గూర్చి ఊహాజనితంగా అందరికీ తేలికగా అర్ధమయ్యేరీతిలో ఒక యాత్రీకుని ప్రయాణమును సాద్రుశ్యముగా తీసుకుని అతడు సాగించిన ప్రమాద భరితప్రయాణము, తానూ వాంచించిన దేశమునకు క్షేమముగా చేరుకున్న క్రమము అన్వేషనాయుతముగావివరించబడినది. ప్రతీ క్రైస్తవుడు ఆత్మీయ జీవితములో ఉన్నత శిఖరాలను అధిరోహించాటానికి క్రీస్తుకుమరింత దగ్గరగా జీవించటానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. క్రిస్టియన్ బుక్ డిస్ట్రిబుటర్స్ , హైదరాబాద్ వారు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు. ప్రతీఒక్కరూ పొంది మీరును ఆత్మీయంగా బలపడాలని మేము ఆశిస్తున్నాము.