Friday, December 10, 2010

దేవునికే మహిమ కలుగును గాక


apchristiannews.com విజిటర్స్ అందరికి దేవాది దేవుడును ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనములు. apchristiannews.com అను ఈ వెబ్సైటు ప్రారంభించటానికి కృప చూపిన దేవునికి స్తోత్రములు చేల్లిస్తున్నాము. ప్రభు సేవలో మేమును పాలి భాగస్తులము కావలెనన్న ఆశతో ఉన్న మమ్ములను దేవుడు ఈ రీతిగా కనికరించినందులకు మేము మరింతగా దేవుని యెడల నమ్మకముగా పని చేయటానికి ఆ దేవాది దేవుడు మాకు తన నిండైన కృపను చూపించును గాక. ఆమెన్. మొదటిసారిగా ఈ వెబ్సైటు ను సందర్శిస్తున్న మీరును మీ యొక్క ఆత్మీయ సలహాలు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. అంతే కాకుండా మీ యొక్క రచనలు, వ్యాఖ్యానాలు, ఇతరత్రా ఏమైనా ఉన్నట్లయితే మాతో మరియు మన అందరితో పంచుకోగలరని మనవి.

ఇట్లు www.apchristiannews.com team

Friday, February 12, 2010

ప్రేమ గల వారిగా ఉన్నారా ?


ప్రేమ గల వారిగా ఉన్నారా ?
అనగనగా ఒకానొక అడవిలో రెండు జింకలు నివసించేవట. అవి రెండూ ఎంతో స్నేహంగా ఉంటూ ఉండేవట. ఒక రోజు అవి రెండూ దాహంతో అల్లాడుతూ నీటికోసం అనేక స్థలాలు వెదుకుతూ ఎంత తిరిగినా ఫలితం లేదట. తిరిగి తిరిగి వేసారిపోయిన వాటికి చివరికి ఒకచోట కొద్దిగా మాత్రమే నీరు ఉన్న గుంత ఒకటి కనపడెనట. ఆ నీరు రెండిటికీ సరిపోదన్న సంగతి గ్రహించి, దేనికదే మనసులో తన స్నేహితుడు త్రాగితే చాలులే అని అనుకున్నా యట. అయితే ఒక దాని విడిచి మరొకటి త్రాగుట వాటికి కుదరదన్న సంగతి గ్రహించి రెండు జింకలూ గుంటలో మూతి పెట్టి త్రాగటం మొదలు పెట్టాయట. కాని, కొంత సేపటికి నీరు మాత్రం తగ్గటం లేదని అవి రెండూ గ్రహించాయట. ఎందుకో తెలుసా ? తన స్నేహితుడు త్రాగాలని అవి రెండూ తలంచి తమ మూతిని నీటిలోనే ఉంచి త్రాగుతున్నట్లు నటించాయట. ఎంత గొప్ప ప్రేమ ?

"తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడేవ్వడునూ లేడు. " యోహాను 15: 13.

మరి మీరునూ ఆలాగు ఉండగలుగుతున్నారా ?



మోకరించి ప్రార్దించు క్రైస్తవుడు (The Kneeling Christian)



మోకరించి ప్రార్దించు క్రైస్తవుడు అనే ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొంది అనేకమైన భాషలలోనికి అనువదించబడి విశేషమైన జనంగానికి మార్గోపదేసంగా ఉంది. ఈ పుస్తకం ఒక అజ్ఞాత క్రైస్తవుని చే వ్రాయబడినదని మీకు తెలుసా ? 1930 వ ప్రాంతములో మొదట ఇంగ్లాండ్ లోను తదుపరి అమెరికా లోను ముద్రించబడిన ఈ పుస్తకం రాను రాను అనేకమైన భాషలలోనికి అనువదింపబడినట్లే తెలుగులో 1994 ప్రాంతములో రచయిత వై. కనక రత్నం గారి ద్వార అనువదింపబడి తెలుగు క్రైస్తవ లోకానికి కూడా ఒక మార్గదర్సకముగా నిలువబడినది. ఈ గ్రంధం కోట్లాది ప్రజల ప్రార్దన జీవితాల్ని ప్రభావితం చేసింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. జీవన్ జ్యోతి ప్రెస్ & పబ్లిషర్స్ వారిచే ముద్రించబడిన ఈ పుస్తకం మీరును పొంది ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందగలరని మా ఆకాంక్ష.

Wednesday, February 10, 2010

మెదక్ చర్చ్


మెదక్ చర్చ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో నిర్మించబడిన అద్బుతమైన దేవాలయం. ఇది ప్రస్తుతం దక్షిణ ఇండియా సంఘము ఆధ్వర్యములో నిర్వహించబడుతున్నది. సుమారు ఐదు వేల మంది ఒకేసారి ఆరాధించుకునే అవకాశం ఈ దేవాలయంలో ఉండటం గొప్ప విశేషం. ఇది ' పనికి ఆహార పధకం ' క్రింద నిర్మించబడినదని మీకు తెలుసా? రెండవ ప్రపంచ యుద్ద కాలంలో కరువు సంభవించినపుడు అప్పటి మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్, చర్చ్ నిర్మాణం తలపెట్టి, ఈ నిర్మాణంలో పాలు పొందిన గ్రామస్తులకు ఆహారాన్ని ఇవ్వటం ద్వారా నిర్మాణాన్ని పూర్తి చేయటం జరిగినది. ఆసియా లోనే అతి పెద్దదైన ఈ దేవాలయం 1914 నుండి 1924 నుండి కొనసాగింది. ఈ దేవాలయం వస్తు శిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్. ఈ దేవాలయాన్ని దర్శించు కోవాలనుకునే వారు హైదరాబాద్ జూబిలీ బస్సు స్టాండ్ నుండి లేదా బాలానగర్ చౌరస్తా నుండి వెళ్ళవచ్చు.

Wednesday, January 27, 2010

Shalom


షలోం !
ప్రభువు నామములో మీ అందరికి వందనములు. తెలుగు క్రైస్తవ ప్రపంచములో, దేవుని పనిలో నేనును వాడబాడటానికి దేవుడు నా పట్ల చూపిన కృప ను బట్టి ముందుగ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక ముందు రాబోయే రోజులలో అనేకమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశ పడుతున్నాను. మీరును పరిచర్యలో భాగస్తులు కాగలరని కోరుతున్నాను.