Tuesday, January 25, 2011

పాస్టర్ పై దాడి- పట్టించుకోని పోలీసులు


జనవరి 14, 2011 : క్రైస్తవ సోదరులపై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టినట్టుగా apchristiannews.com దృష్టికి వచ్చింది. వివరాల్లోకి వెళితే పాస్టర్ స్వామి దాసు తన భార్యతో పాటు మరి కొందరి క్రైస్తవ విస్వాసులతో కలసి ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు జిల్లాలోని కామారెడ్డి నందు కలసి ప్రార్ధన చేసుకొంటూ ఉండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గదిలోనికి ప్రవేశించి వారిపై దురుసుగా వ్యవహరించి వారిని బయటకు గెంటివేయటం జరిగింది. దానితో వారు ఇంటికి తిరిగి వెల్లిపొవుచుండగా మార్గ మాద్యమం లో సుమారు 70 మంది గుర్తు తెలియని వ్యక్తులు కాపు కాచి పాస్టర్ యొక్క బృందాన్ని అటకాయించి కొట్టి గాయపరచినట్టుగా తెలిసింది. ఇదే విషయమై బాధితులు నిజామాబాదు జిల్లాలోని తాడువాయి పోలీసు స్టేషన్ నందు కంప్లైంట్ చేయటానికి ప్రయత్నించగా అదే జిల్లాకు చెందిన రాష్ట్ర రాజకీయ నాయకుడొకరు ఇరు వర్గాలు రాజీ చేసుకుంటారు అన్న వంకతో కేసు నమోదు కాకుండా అడ్డుపడినట్లు తెలిసింది. సంబంధిత విషయమై apchristiannews.com తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ బాధితుల కొరకు ప్రార్ధన చేయాలనీ మా విసిటర్స్ ను కోరుతున్నాము.

No comments:

Post a Comment