Saturday, January 29, 2011

సిలువను గూర్చిన సువార్త (Gospel)



Rev. E. Bapanayya, B.A., B.Th.
AELC, Vegeswarapuram.

దేవుని ర‌క్ష‌ణ వార్త‌ను తెలుసుకొనుచు విశ్వాస‌ములో ఎదుగుతున్న వారికంద‌రికి ప్ర‌భువైన యేసుక్రీస్తు నామ‌ములో శుభ‌ములు వంద‌న‌ములు తెలియ‌చేసుకొంటున్నాము. ప్ర‌స్తుత స‌మాజంలో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బ‌ట్టి వివిధ ర‌కాలైన టెక్నాల‌జీల ద్వారా సువార్త సందేశ‌ములు అందించ‌బ‌డుతున్నాయి. అదేవిధముగా ఇంట‌ర్‌నెట్ ద్వారా కూడా సువార్త అందించ‌బ‌డుతుంది. అయితే తెలుగులో దేవుని ర‌క్ష‌ణ సువార్త‌ను అందించాల‌నే మా ఈ ప్ర‌య‌త్నం అనేక‌మంది యేసుక్రీస్తుని సొంత ర‌క్ష‌కునిగా అంగీక‌రించ‌టానికి స‌హాయ‌ప‌డులాగున ప్రార్ద‌న చేస్తున్నాము.

శిలువ‌ను గూర్చిన వార్త సువార్త (1 కొరింథీ 1 - 18)

ఈ రోజుల్లో అనేక‌మంది అనేక ప‌ద్ద‌తుల ద్వారా సువార్త ను ప్ర‌క‌టిస్తున్నారు. సువార్త ను ప్ర‌క‌టించ‌టంలో ఒక్కొక్క‌రు ఒక్కొక్క style క‌న‌ప‌రుస్తూ ఉంటారు. అయితే ఎవరు ఏ విధంగా చెప్పినా సువార్త అనేది మ‌నుష్యుని ర‌క్షించేది, శ‌క్తిని ఇచ్చేది, జ్ఞాన‌మును ఇచ్చేది మ‌రియు పోషించేది. అపోస్త‌లుడైన పౌలు యొక్క విశ్వాశ‌ములో మంచి సువార్త ప్ర‌క‌టించ‌డం అనేది శిలువ‌ను గూర్చిన వార్త సువార్త‌

సువార్త ప్ర‌క‌ట‌న అన‌గా (1 కొరింథీ 1-17)

ఇంగ్లీష్ లో ఇవాంజ‌లైజ్ అన్నారు. అన‌గా సువార్త అనే వ‌ల వేసి ప‌ట్టుకొనుట‌. దేవుని గూర్చిన వార్త ఆయ‌న‌ను న‌మ్మువారిని ర‌క్షిస్తుంది. ఇది ఆయ‌న ముఖ్య సంక‌ల్పం. సువార్త ప్ర‌క‌ట‌న చేయ‌డం అన‌గా సాక్ష్య‌ము చెప్ప‌టం. ప్ర‌భువైన యేసు క్రీస్తు మీరు వెళ్ళి స‌ర్వ సృష్టికి సువార్త‌ను చెప్ప‌మ‌న్నాడు (మార్కు 16 - 15). సువార్త ప్ర‌క‌ట‌న అనేది ప్ర‌తీ క్రైస్త‌వుని జీవిత‌ములో ఖ‌చ్చితంగా ఆచ‌రించ‌వ‌ల‌సిన ప్ర‌క్రియ అయి ఉన్న‌ది.

సువార్త అన‌గా శిలువ‌ను గూర్చి ప్ర‌క‌టించ‌డం

శిలువ‌ను చూడ‌గానే ప్ర‌భువైన యేసుక్రీస్తు మ‌ర‌ణ, పున‌రుథ్థాన‌ములు గుర్తుకు వ‌స్తాయి. ఆయ‌న మ‌ర‌ణం మ‌న పాప‌ముల కొర‌కు ఆయ‌న చేసిన త్యాగం. మ‌న కొర‌కు ఆయ‌న చూపిన శ‌క్తి. సువార్త అనేది క్రైస్త‌వులు సిగ్గుప‌డ‌వ‌ల‌సిన విష‌యం కాదు. అందుకే పౌలు అంటాడు సువార్త‌ను గూర్చి నేను సిగ్గుప‌డువాడ‌ను కాను. ఏల‌య‌న‌గా న‌మ్ము ప్ర‌తివానికి, మొద‌ట యూదునికి, గ్రీసు దేశ‌స్తునికి కూడ ర‌క్ష‌ణ క‌లుగ‌చేయుట‌కు అది దేవుని శ‌క్తియై యున్న‌ది.(రోమా 1-16)
శిలువ‌ను గూర్చిన వార్త న‌మ్మిన ప్ర‌తివానికి ర‌క్ష‌ణ, దేవుని శ‌క్తి. న‌శించువారికి అన‌గా న‌మ్మ‌ని వారికి వెఱ్ఱిత‌న‌ము. న‌మ్మి విశ్వ‌సించువాడు ర‌క్షింప‌బ‌డును.

హృద‌య‌ముతో వినువాడు విశ్వ‌సిస్తాడు. విశ్వ‌సించిన ప్ర‌తివాడు జీవిస్తాడు.

ఆమెన్‌.

No comments:

Post a Comment